పోస్ట్‌లు

మరీ అంత శివ ద్వేషమా!

చిత్రం
 Chinna Jeeyar Swamy Controversy Statement on Adi Shankaracharya శ్రీ చిన్న జీయర్ స్వామి గారు తాను భక్తులకు ఇస్తున్న ఒక ప్రచనంలో శ్రీ ఆదిశంకరాచార్యుల వారి పేరును ఉటంకిస్తూ చాతురామ్నాయ పీఠాలు స్థాపించింది ఆయన కాదని కొంచెం వ్యంగ్య స్వరం తో చెబుతూ ఆ పీఠాలను స్థాపించింది విజయనగర సామ్రాజ్య స్థాపకులైన హరిహర బుక్కరాయల గురువు, శృంగేరి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య స్వామి వారని పేర్కొనడం జరిగింది. చారిత్రాత్మకంగా ఆ పీఠాలను స్థాపించింది శంకరాచార్యుల వారని జగద్విదితం. వీరు చరిత్రను చింపేస్తున్నారో తిరగరాస్తున్నారో తెలియదు గానీ సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ, విశ్లేషిస్తూ అనుసరిస్తున్న వారికి ఈ మాటలు ఆమోదనీయం కాదు. పైగా వారు మరొక రెండు నిందలు వేశారు. మొదటిది శంకరాచార్యుల వారు విష్ణువుని కీర్తించాడని, విష్ణు సహస్రనామం, భగవద్గీతలకు భాష్యాలు వ్రాసాడు కనుక ఆయన శుద్ధ వైష్ణవుడు అని అనడం. రెండవది ఆయనకు పంచాయతనం తెలియదని. పంచాయతనాన్ని ప్రతిపాదించింది కూడా శ్రీ విద్యారణ్య స్వామి వారేనని. మొదటి నిందకు సమాధానం: ఒక శివారధకుడు విష్ణువుని కీర్తించినంత మాత్రాన వైష్ణవుడు అవుతాడా? మరి రామాయణం లో రాముడు శివ లింగాన్ని ప్...

ఊహకు అందని వ్యధ | విజయా రెడ్డి కథ

చిత్రం
 Vijaya Reddy, a software employee committed suicided at Charlapalli Railway station on track with her two children without any clue. Railway police handling this case but still not solved. It is very sensational because she did not left any reason to her suicide. ఇప్పటికీ వీడని చిక్కుముడి! ఒక్కొక్కరిదీ ఒక్కో మాట! ఆరు నెలల క్రితం ఇంట్లో ఏదో గొడవ జరిగిందని, బిగ్గరగా అరుపులు వినిపించాయి అని ఒకరు చెబితే... ఆమె తల్లి చెప్పిన దాని ప్రకారం ఆమె తను కొత్తగా కట్టిస్తున్న ఇంటి వద్ద ఏవో పూజలు జరిపించిందని, ఏవో రంగు బట్టలు ధరించి ఇంట్లో కూడా పూజలు చేయించిందని ఒకరు చెబుతున్నారు. ఆమె ఏదో బ్లాక్ మేజిక్ తంత్రా, క్షుద్ర ఉపాసకుడిని ఇంటికి తీసుకుని వచ్చి క్షుద్ర పూజలు చేయించి ఉంటుందని, బహుశా వాటి కారణంగా ఆమె భ్రమలకు లోనై ఇలా పిల్లలతో సహా మరో కొత్త జన్మ కోసం ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని మరొకరు చెబుతున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మరో అడుగు ముందుకు వేసి ఆమె క్షుద్ర పూజలు చేస్తున్నట్లు AI జెనరేటెడ్ ఇమేజెస్ తో థంబ్నెయిల్స్ శెట్టి మరీ వీడియోలు పోస్ట్ చేసాయి. ఫోరెన్సిక్ ల్యాబ్ షార్ట్ సర్క్యూట్ అయ్యి పొగలు ...

జీవితమే ఒక ప్రవచనం

చిత్రం
  సూరిబాబు పనిమీద ఒక రోజు పట్నం వెళ్ళాడు. పట్నంలో దసరా నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రోజూ సాయంత్రం వేళ దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయం వద్దకు వెళ్లి దర్శనం చేసుకుని, అక్కడ జరిగే వేడుకలు చూసి, రాత్రి తన రూముకి తిరిగి వెళ్ళేవాడు. చివరి రోజున ఒక ప్రవచన కార్యక్రమం జరుగుతుంటే పోయి కూర్చుని వింటున్నాడు. ఆ ప్రవచన కారుడు ఇలా చెబుతున్నాడు...‌ దేవేంద్రుడు, దేవతలు బండాసుర రాక్షసుల బలానికి తట్టుకోలేక అమరావతిని విడిచిపెట్టి పారిపోయారు. దేవేంద్రుడు ఢీలా పడిపోయి కూర్చున్నాడు. అప్పుడు అతని భార్య అతనికి ధైర్యం చెప్పి, అమ్మవారి శరణు కోరమంది. సరే అని దేవతలతో సహా దేవేంద్రుడు అమ్మవారి కోసం ప్రార్థనలు చేసాడు.  అప్పుడు అమ్మవారు కనికరించి కామేశ్వరీ దేవతగా వచ్చి భండాసురుని అంతం చేసింది. కనుక ఎప్పుడూ నీకు కష్టాలు వస్తే కుమిలిపోతూ కూర్చోకు. అలా కుమిలిపోతూ కూర్చుంటే ఫలితం ఉండదు. ధైర్యంగా ఎదుర్కోవాలి అంటూ చెబుతూ... కష్టాలు అంటే ఏమిటి కల! అసలు ఈ లోకమే ఒక కల. మనం పుట్టడం ఒక కల‌. పెరగడం ఒక కల. సంసార జీవితం ఒక కల. పగలు కల. రాత్రి కల. రాత్రి నిద్రలో కలగనడం ఒక కల. మళ్ళీ మేల్కోవడం ఒక కల. బాధ్యతలూ, బరువులు మోయ...

బ్రతుకు తెరువు

చిత్రం
సూర్యంపేట గ్రామంలో బ్రహ్మం అనే ఒక వడ్రంగి కుటుంబం నివసిస్తూ ఉండేది. ఆ గ్రామంలో అతనికి నిత్యం చేతినిండా పని ఉండేది. నాగలి కొయ్య, ఎడ్లబండి, బండి చక్రాలు, ఇళ్ళ తలుపులు, ద్వారబంధాలు, ఒకటేమిటి... చెక్కపనికి సంబంధించిన పనులన్నీ బ్రహ్మం కుటుంబమే చేసేది.  గ్రామస్తులంతా బ్రహ్మం కుటుంబాన్ని చాలా ఆదరించేవారు. ఎందుకంటే కులవృత్తిని నమ్ముకున్న ఆ కుటుంబం ధనానికి వెంపర్లాడకుండా ఊరి అవసరం కోసం పనిచేసేది. ఊరి వాళ్ళు కూడా బ్రహ్మం కూటుంబానికి ఏలోటూ లేకుండా చూసుకునేవారు.  కానీ కాలం మారిపోయింది... బ్రహ్మం ముసలి వాడయ్యాడు. ఓపిక తగ్గిపోయింది. అతని కొడుకులు మాత్రం అదే వృత్తిలో పని చేస్తున్నారు... ఇప్పుడు ఊరు కూడా ఇదివరకటిలా లేదు. చాలా మారిపోయింది. ఊరి జనం కూడా మారిపోయారు. మునుపటి మంచితనం, సహకారం ఇప్పుడు వారిలో కనిపించడం లేదు.  ఎందుకంటే... ఎడ్లబళ్ళ అవసరం తగ్గిపోయింది. ట్రాక్టర్ల వాడకం పెరిగింది. నాగలి అవసరం లేకుండానే పొలం దున్నే వ్యవస్థ వచ్చేసింది. ఇళ్ళకు వాసాలు కమ్మీలు అవరం తగ్గిపోయింది. కిటికీలు, ద్వారబందాలు, తలుపులు తప్ప మిగతాదంతా సిమెంటు, కాంక్రీటు పనే. పైగా రెడీ మేడ్ తలుపులకు, ఫర్నీచర్ కు గ్...