ఊహకు అందని వ్యధ | విజయా రెడ్డి కథ
ఇప్పటికీ వీడని చిక్కుముడి! ఒక్కొక్కరిదీ ఒక్కో మాట! ఆరు నెలల క్రితం ఇంట్లో ఏదో గొడవ జరిగిందని, బిగ్గరగా అరుపులు వినిపించాయి అని ఒకరు చెబితే...
ఆమె తల్లి చెప్పిన దాని ప్రకారం ఆమె తను కొత్తగా కట్టిస్తున్న ఇంటి వద్ద ఏవో పూజలు జరిపించిందని, ఏవో రంగు బట్టలు ధరించి ఇంట్లో కూడా పూజలు చేయించిందని ఒకరు చెబుతున్నారు.
ఆమె ఏదో బ్లాక్ మేజిక్ తంత్రా, క్షుద్ర ఉపాసకుడిని ఇంటికి తీసుకుని వచ్చి క్షుద్ర పూజలు చేయించి ఉంటుందని, బహుశా వాటి కారణంగా ఆమె భ్రమలకు లోనై ఇలా పిల్లలతో సహా మరో కొత్త జన్మ కోసం ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని మరొకరు చెబుతున్నారు.
కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మరో అడుగు ముందుకు వేసి ఆమె క్షుద్ర పూజలు చేస్తున్నట్లు AI జెనరేటెడ్ ఇమేజెస్ తో థంబ్నెయిల్స్ శెట్టి మరీ వీడియోలు పోస్ట్ చేసాయి.
ఫోరెన్సిక్ ల్యాబ్ షార్ట్ సర్క్యూట్ అయ్యి పొగలు వస్తుంటే చూసి, లోపల ఏం జరిగిందో తెలియకుండానే అదిగదిగో విజయా రెడ్డికి సంబంధించిన ల్యాప్ టాప్, మొబైల్ ఫోన్లు ధగ్దమైపోయాయని, ఇంక ఈ రహస్యం ఛేదించడం ఇంపాజిబుల్ అని మరికొందరు....
ఆ సాక్ష్యాలతో పాటూ... టెలిఫోన్ ట్యాపింగ్ సాక్ష్యాలు, ఈ-కార్ రేసు, రేవంత్ ఓటుకు నోటు, ఇంకా చాలా సాక్ష్యాలు కూడా పోయాయని మరికొన్ని న్యూస్ ఛానెల్స్ వార్తలు వదిలాయి.
ఈ అత్యుత్సాహ వార్తలు నిజాన్ని పాతిపెట్టి, అబధ్ధాలని బ్రతికించడానికి నేరస్తులకు, నిందితులకు చక్కగా ఉపయోగపడతాయి.
ఒకవేళ అవి చెక్కుచెదరకుండా ఉన్నా కూడా... అబ్బే అవి ఫేక్ సాక్ష్యలని, అసలు సాక్ష్యాలు అగ్ని ప్రమాదంలో కాలిపోయాయని ప్రజలను నమ్మించే అవకాశం పుష్కలంగా ఉంది.
ఇక విజయారెడ్డి విషయానికి వస్తే రైల్వే పోలీసుల దర్యాప్తులో ఇప్పటివరకూ ఏ వార్తా కూడా అఫీషియల్ గా ధృవీకరించబడలేదు.
వాళ్ళు డిప్రెషన్ అనే ఒక మాటను లీక్ చేసి వదిలారు.
ఎందుకు డిప్రెషన్ లో ఉంటుంది? ఆమె అంతకు రెండు గంటల ముందు వరకూ చురుకుగా తన పనులు చేస్తూ డిప్రెషన్ ఛాయలే లేకుండా ఉంది కదా? మరి డిప్రెషన్ అంటారేంటి?
నోనో డిప్రెషన్ పేరుతో కేసు క్లోజ్ చేయడానికి మేం ఒప్పుకోం. ఇంకేదో మిస్టరీ ఉంది. ఛేదించి తీరాలి. అంటూ ఇటు కుటుంబ సభ్యులు, అటు మీడియా వర్గాలు కూడా కొట్టిపడేసాయి.
ఈ కేసును రైల్వే పోలీసుల నుండి, స్టేట్ తెలంగాణ పోలీసులకో, సిబిఐ కో అప్పగిస్తే ఈపాటికే తేలిపోయి ఉండేదని కొందరు యూట్యూబ్ ఛానెల్స్ ఇంటర్వ్యూలలో వాళ్ళ అభిప్రాయాల్ని చెబుతున్నారు.
ఏదో తెలియని ఊహకందని రహస్యమే విజయారెడ్డిని తన ఇద్దరు పిల్లలతో చర్లపల్లి వరకూ నడిపించింది అనేది మాత్రం అందరూ ఏకగ్రీవంగా అభిప్రాయ పడుతున్నారు.
కానీ ఆ బలమైన కారణం ఏది అనే దాంట్లో మాత్రం భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
అసలు ఎందుకు చనిపోవాలి అనే ప్రశ్న విడిచిపెట్టి, సిటీ మధ్యనుండి చర్లపల్లి రైల్వేస్టేషన్ వరకూ ఎందుకు వెళ్ళి చనిపోవాలి? మరోవిధంగా ప్రయత్నించి ఉండవచ్చు కదా? ఎందుకు ఆ మార్గమే ఎంచుకున్నారు?
అసలు వాళ్లు స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నారా? లేదా ఎవరైనా వాళ్ళని అక్కడే చనిపోవాలని నిర్దేశించారా?
ఒకవేళ చర్లపల్లి రైల్వేస్టేషన్ ని ఎంచుకోవడం వలన ప్రయోజనం ఏదైనా ఉందా? ఎవరికి లాభం? ఎవరికోసం ఆ త్యాగం?
మీకేమనిపిస్తోందో కామెంట్ చేయండి.
నా అనుమానం ఏమిటంటే చర్లపల్లి రైల్వేస్టేషన్ సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించినది కనుక ఇది దేశ వ్యాప్త వార్త అవుతుంది. డిప్రెషన్ మరణమే ఐతే గనుక దేశ వ్యాప్త వార్త కావాలని విజయారెడ్డి ఎందుకు కోరుకుంటుంది? అంటే ఇది ఆమె కావాలని తీసుకున్న లక్ష్యం కాదు. ఇంకెవరో ఆమెకు ఆ లొకేషన్ ఇచ్చారు.
ఆ ముగ్గురూ ఎటువంటి టెన్షన్ పడకుండా ఒక పని పూర్తి చేయడానికి అన్నట్లుగా సిటీ నుండి బయలుదేరి అక్కడికి వెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.
ఈ పనిని వాళ్ళు ఏదైనా సమస్యలో నుండి బయటపడటం కోసం చేసారా? లేదా ఎవరైనా సైకో కిల్లర్ వాళ్ళ బ్రైయిన్స్ ని తన కంట్రోల్ లోకి తెచ్చుకుని ఎలక్ట్రానిక్ డివైస్ ద్వారా వాళ్ళకి ఆదేశాలు పంపుతూ నడిపించాడా?
హిప్నాసిస్, క్షుద్ర విద్యల ద్వారా వాళ్ళు ఆ పని చేసే అవకాశం మాత్రం లేదు. ఎందుకంటే వాళ్లు చాలా నార్మల్ గానే నడుచుకుంటూ వెళ్ళారు. కారు అక్కడికి చేరుకోవడానికి ఆమే డ్రైవ్ చేసిందని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయో లేదో తెలీదు.
ఒకవేళ ఆ ముగ్గురితో పాటూ ఆ కారులో నాల్గవ వ్యక్తి కూడా వచ్చాడా? లేదా ఫాలో అవుతూ వచ్చి పదడుగుల దూరం నుండి వాళ్ళకి ఆదేశాలు పంపాడా? అదే జరిగితే ఆ వ్యక్తి ఎవడై ఉంటాడు? అంత అవసరం ఏముండి ఉంటుంది?
ఆ ముగ్గురూ ఒకేసారి ఆత్మార్పణ చేసుకోవడం వలన ఎవరికి ప్రయోజనం? ఆస్తి వివాదం అనే సందేహం అన్నగారిపై పడేలా ప్లాన్ జరిగిందా? లేదా భర్తతో వియోగం అనే సందేహం పుట్టేలా ప్లాన్ జరిగిందా?
ఒకవేళ వాళ్ళు కుట్రలో భాగం అయిఉంటే ఈపాటికే ఈజీగా దొరికిపోయేవారు. ఇది ఏదో మాస్టర్ మైండ్ గేమ్ ప్లాన్ లా కనిపిస్తోంది. ఇది బైట పడకపోతే ఇలాంటి ఘోరాలు ముందు ముందు దేశం మరిన్ని చూడవలసి వస్తుంది.
మీరేం అనుకుంటున్నారో మీ అభిప్రాయం క్రింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ధన్యవాదాలు.
%20(2).jpeg)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి