మరీ అంత శివ ద్వేషమా!
శ్రీ చిన్న జీయర్ స్వామి గారు తాను భక్తులకు ఇస్తున్న ఒక ప్రచనంలో శ్రీ ఆదిశంకరాచార్యుల వారి పేరును ఉటంకిస్తూ చాతురామ్నాయ పీఠాలు స్థాపించింది ఆయన కాదని కొంచెం వ్యంగ్య స్వరం తో చెబుతూ ఆ పీఠాలను స్థాపించింది విజయనగర సామ్రాజ్య స్థాపకులైన హరిహర బుక్కరాయల గురువు, శృంగేరి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య స్వామి వారని పేర్కొనడం జరిగింది.
చారిత్రాత్మకంగా ఆ పీఠాలను స్థాపించింది శంకరాచార్యుల వారని జగద్విదితం. వీరు చరిత్రను చింపేస్తున్నారో తిరగరాస్తున్నారో తెలియదు గానీ సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ, విశ్లేషిస్తూ అనుసరిస్తున్న వారికి ఈ మాటలు ఆమోదనీయం కాదు.
పైగా వారు మరొక రెండు నిందలు వేశారు. మొదటిది శంకరాచార్యుల వారు విష్ణువుని కీర్తించాడని, విష్ణు సహస్రనామం, భగవద్గీతలకు భాష్యాలు వ్రాసాడు కనుక ఆయన శుద్ధ వైష్ణవుడు అని అనడం.
రెండవది ఆయనకు పంచాయతనం తెలియదని. పంచాయతనాన్ని ప్రతిపాదించింది కూడా శ్రీ విద్యారణ్య స్వామి వారేనని.
మొదటి నిందకు సమాధానం:
ఒక శివారధకుడు విష్ణువుని కీర్తించినంత మాత్రాన వైష్ణవుడు అవుతాడా? మరి రామాయణం లో రాముడు శివ లింగాన్ని ప్రతిష్టించి శివారాధన చేసాడని చెబుతారు రాముడిని శైవుడు అని అంటారా? భస్మాసుర సంహారం కోసం విష్ణువు మోహినీ అవతారం ఎత్తినప్పుడు ఆ మోహంలో శివుడు సైతం పడిపోయాడని చెబుతారు. శివ కేశవులు వేరైనా వారిద్దరూ సృష్టి స్థితి లయల ధర్మాలను విధి నిర్వహణను పాటిస్తూ జగత్ జనని అయిన ఆదిశక్తిచే సృష్టించబడిన పరమోన్నతమైన ఆది దైవాలు.
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అని సాక్షాత్తు శివుడే చెప్పారు. శివ విష్ణువుల మధ్య లేని బేధం వీళ్ళు కెందుకు.
వారిని వేరువేరుగా చూడటమే దైవాపరాథంగా భావించాలి.
ఇక రెండవ నిందకు సమాధానం:
ద్వాపర యుగం తర్వాత ఈ భరత ఖండంలో శైవ వైష్ణవ మత విద్వేషాలతో అనేక యుద్ధాలు జరుగుతున్న సమయంలో శ్రీఆది శంకరులు తన విశేష ప్రతిభతో అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. భక్తి మార్గం ద్వారా భగవంతుడిని భక్తుడిని ఒకటి చేసే తత్వ బోధన చేస్తూ అనేక స్తోత్రాలు రచించారు. ఉపనిషత్తులకు భాష్యాలు వ్రాసారు. వారు సాక్షాత్తు దైవ స్వరూపులు.
నేటికీ చాలా మంది పండితులు శ్రీ ఆది శంకరాచార్యుల వారు 32 సంవత్సరాల అతి తక్కువ జీవితకాలంలో ఇంత రాయడం ఎలా సాధ్యమైందని ఆశ్చర్యపోతున్నారు. ఆయన మహా జ్ఞాని, అద్వైత తత్వాన్ని బోధించడానికి, స్థాపించడానికి ఒక లక్ష్యంతో పనిచేసిన దైవాంశ సంభూతుడు.
ఆయన రచనలలో ఎక్కువ భాగం అద్వైతంపై దృష్టి సారించినప్పటికీ, చిత్తశుద్ధికి భక్తి చాలా ముఖ్యమైనదని ఆయన నమ్మినందున ఆయన భక్తి తత్వాన్ని ప్రబోధించారు, భక్తి లేకుండా ఆత్మసాక్షాత్కారం సాధ్యం కాదు.
అందువల్ల ఆయన అమ్మవారిని, పరమేశ్వరుని, శ్రీమహావిష్ణువుని, గణేషుడిని, సుబ్రహ్మణ్య స్వామిని, హనుమంతుడుని, రాముడిని, కృష్ణుడిని నదీమతల్లులని స్తుతిస్తూ అనేక శ్లోకాలను సమకూర్చారు, వాటిలో ఎక్కువ భాగం విష్ణువు, శివుడు మరియు శక్తిపై కేంద్రీకృతమై ఉన్నాయి.
ప్రజలు తమ కోరిక మేరకు ఏ రూపంలోనైనా దైవాన్ని పూజించాలని ఆయన కోరుకున్నారు, దాని ఫలితాలు చివరకు వారి మనస్సును శుద్ధి చేసుకుని ఆత్మసాక్షాత్కారానికి తగినట్లుగా చేయాలి.
ఆయన జీవిత చరిత్ర నుండి, ఆయనను నరసింహుడు, సరస్వతి దేవత మరియు విశ్వనాథుడు ఆశీర్వదించారని స్పష్టంగా తెలుస్తుంది. అందువల్ల ఆయనలో నిజమైన వైష్ణవ, శైవ మరియు శాక్తులను కనుగొనవచ్చు. శ్రీ శంకరాచార్యులు రాసిన హస్తమాలకీయం యొక్క భాష అత్యంత ముఖ్యమైన అంశం.
భాష్య గ్రంథాలు
బ్రహ్మ సూత్రాలు
ఈశావాస్య ఉపనిషత్తు
కేన ఉపనిషత్తు
కథా ఉపనిషత్తు
ప్రశ్న ఉపనిషత్తు
ముండక ఉపనిషత్తు
మాండూక్య ఉపనిషత్తు
మాండూక్య కారిక
ఐతరేయ ఉపనిషత్తు
తైత్తిరీయ ఉపనిషత్తు
ఛాందోగ్య ఉపనిషత్తు
బృహదారణ్యక ఉపనిషత్తు
శ్రీ నృసింహ తాపనీయ ఉపనిషత్తు
భగవద్గీత
విష్ణు సహస్రనామం
సనత్ సుజాతీయం
లలితా త్రిశతి
హస్తమాలకీయం
ప్రకరణ గ్రంథాలు
వివేకచూడామణి
అపరోక్షానుభూతి
ఉపదేశసహస్రీ
వాక్య వృత్తి
స్వాత్మ నిరూపణమ్
ఆత్మ బోధ
సర్వ వేదాంత సార సంగ్రహ
ప్రబోధ సుధాకరం
స్వాత్మ ప్రకాశిక
అద్వైత అనుభూతి
బ్రహ్మ అనుచింతనం
ప్రశ్నోత్తర రత్నమాలిక
సదాచార అనుసంధానం
యాగ తారావళి
అనాత్మశ్రీ విగర్హణం
స్వరూప అనుసంధానం
పంచకరణం
తత్త్వ బోధ
ప్రౌడ అనుభూతి
బ్రహ్మ జ్ఞానావళి
లఘు వాక్యవృత్తి
భజ గోవిందం
ప్రపంచ సారం
శ్లోకాలు మరియు ధ్యాన పద్యాలు
శ్రీ గణేశ పంచరత్నం
గణేశ భుజంగం
సుబ్రహ్మణ్య భుజంగం
శివ భుజంగం
దేవి భుజంగం
భవానీ భుజంగం
శ్రీరామ భుజంగం
విష్ణు భుజంగం
శారదా భుజంగం
శివానంద లహరి
సౌందర్య లహరి
ఆనంద లహరి
శివపాదాది కేశాంత వర్ణనా
శివ కేసాది పదాంత వర్ణనా ॥
శ్రీ విష్ణు-పాదాది-కేశాంత
ఉమా మహేశ్వర స్తోత్రం
త్రిపురసుందరీ వేదపద స్తోత్రం
త్రిపురసుందరీ మానసపూజా
త్రిపురసుందరి అష్టకం
దేవి షష్టి ఉపచార-పూజ
మంత్ర మాతృక పుష్పమాల
కనకధారా స్తోత్రం
అన్నపూర్ణ స్తోత్రం
అర్ధనారేశ్వర స్తోత్రం
భ్రమణాంబ అష్టకం
మీనాక్షి స్తోత్రం
మీనాక్షి పంచరత్నం
గౌరీ దశకం
నవరత్న మాలిక
కల్యాణ వృష్టిస్తవం
లలిత పంచరత్నం
మాయ పంచకం
సువర్ణ మాల స్తుతి
దాస స్లోకి
వేద సార శివ స్తోత్రం హర
శివ పంచాక్షర స్తోత్రం
శివాపరాధ క్షమాపణ
దక్షిణామూర్తి అష్టకం
దక్షిణామూర్తి వర్ణమాల
మృత్యుంజయ మానస పూజా స్తోత్రం
శివ నామావళి అష్టకం
కాల భైరవ అష్టకం
షట్పదీ స్తోత్రం
శివ పంచాక్షర నక్షత్ర మాల
ద్వాదశ లింగ స్తోత్రం
కాశీ పంచకం
హనుమత్ పంచరత్నం
లక్ష్మీ-నృసింహ పంచరత్నం
లక్ష్మీ-నృసింహ కరుణరస స్తోత్రం
పాండురంగ అష్టకం
అచ్యుత అష్టకం
శ్రీ కృష్ణ అష్టకం
హరి స్తుతి
గోవింద అష్టకం
భగవత్ మానస పూజ
ప్రాత స్మరణ స్తోత్రం
జగన్నాథ అష్టకం
గురువాష్టకం
నర్మదా అష్టకం
యమునా అష్టకం
గంగ అష్టకం
మణికర్ణికా అష్టకం
నిర్గుణ మానస పూజ
ఏక స్లోకి
యతి పంచకం
జీవన్ ముక్తా ఆనంద లహరి
ధాన్య అష్టకం
ఉపదేశ (సాధన) పంచకం
సతా స్లోకీ
మనీషా పంచకం
అద్వైత పంచరత్నం
నిర్వాణ శతకం
దేవ్యపర-ధ క్షమాప స్తోత్ర
.jpg)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి