జీవితమే ఒక ప్రవచనం
సూరిబాబు పనిమీద ఒక రోజు పట్నం వెళ్ళాడు. పట్నంలో దసరా నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రోజూ సాయంత్రం వేళ దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయం వద్దకు వెళ్లి దర్శనం చేసుకుని, అక్కడ జరిగే వేడుకలు చూసి, రాత్రి తన రూముకి తిరిగి వెళ్ళేవాడు. చివరి రోజున ఒక ప్రవచన కార్యక్రమం జరుగుతుంటే పోయి కూర్చుని వింటున్నాడు. ఆ ప్రవచన కారుడు ఇలా చెబుతున్నాడు... దేవేంద్రుడు, దేవతలు బండాసుర రాక్షసుల బలానికి తట్టుకోలేక అమరావతిని విడిచిపెట్టి పారిపోయారు. దేవేంద్రుడు ఢీలా పడిపోయి కూర్చున్నాడు. అప్పుడు అతని భార్య అతనికి ధైర్యం చెప్పి, అమ్మవారి శరణు కోరమంది. సరే అని దేవతలతో సహా దేవేంద్రుడు అమ్మవారి కోసం ప్రార్థనలు చేసాడు. అప్పుడు అమ్మవారు కనికరించి కామేశ్వరీ దేవతగా వచ్చి భండాసురుని అంతం చేసింది. కనుక ఎప్పుడూ నీకు కష్టాలు వస్తే కుమిలిపోతూ కూర్చోకు. అలా కుమిలిపోతూ కూర్చుంటే ఫలితం ఉండదు. ధైర్యంగా ఎదుర్కోవాలి అంటూ చెబుతూ... కష్టాలు అంటే ఏమిటి కల! అసలు ఈ లోకమే ఒక కల. మనం పుట్టడం ఒక కల. పెరగడం ఒక కల. సంసార జీవితం ఒక కల. పగలు కల. రాత్రి కల. రాత్రి నిద్రలో కలగనడం ఒక కల. మళ్ళీ మేల్కోవడం ఒక కల. బాధ్యతలూ, బరువులు మోయ...